జాతి రత్నాలు చిత్ర సమీక్ష | Jati Ratnalu Movie Review | Sitara | RKSS Creations. జాతిరత్నాలు మూవీ రివ్యూ చిత్రం: జాతిరత్నాలు నటీనటులు: నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ , ఫరియా అబ్దుల్లా , బ్రహ్మజీ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ తదితరులు . కథ: అనుదీప్ కె వి , సినిమాటోగ్రఫి: సిద్ధం మనోహర్ , సంగీతం: రాధన్ , ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్ , ఎడిటర్: అభినవ్ రెడ్డి దండ , బ్యానర్: స్వప్నా సినిమా , నిర్మాత: నాగ్ అశ్విన్ , దర్శకత్వం: అనుదీప్ కె వి ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి చిత్రాల తర్వాత స్వప్నాసినిమా సంస్ధ ముచ్చటగా మూడో చిత్రంగా నిర్మించిందే ' జాతిరత్నాలు '. సహజంగానే స్వప్నా సంస్ధకి ప్రేక్షకులలో ఏర్పడిన నమ్మకంతో జాతిరత్నాలు సినిమా మీద చెప్పుకోదగ్గ అంచనాలే ఏర్పడతాయి. ఏర్పడ్డాయి కూడా. స్వప్నా సంస్థ నిర్మాణానికి మహానటి దర్శకుడు నాగఅశ్విన్ జాతిరత్నాలు కథ ఐడియా విని ఇటువంటి కథను సినిమాగా తీయాలని ముచ్చటపడ్డాడన్న సంగతి జాతిరత్నాలు చిత్రానికి మరింత హైప్‌ని ఇచ్చింది. వీటన్నింటినీ మించి బాహుబలి ది గ్రేట్ ప్రభాస్ , రౌడీ హీరో విజయ...
Comments
Post a Comment