కన్నెల మనసులు దోచుకు పోయిన Kannela Manasulu | Brindavanam | Omkaram | RKSS Creations.

కన్నెల మనసులు దోచుకు పోయిన Kannela Manasulu | Brindavanam | Omkaram | RKSS Creations.





కన్నెల మనసులు. (గోపికలు): పల్లవి: కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా పున్నమి జాబిలి చిన్నబోయిన వన్నెల కాడమ్మా మురళీ గానము మధురిమలో మేము కన్నులు మూయంగా అల్లరి కృష్ణుడు అందాల కృష్ణుడు చెంగున మరుగాయె చరణం: కృష్ణయ్య లేని తనువులు మేము మోయంగ లేమమ్మా ఆతని వేణువు మాధుర్యమే మా ఊపిరి నిలుపమ్మా ఆ కాలి మువ్వల సవ్వడులే మాకు చేతన మిచ్చేది ఆతడు లేని అరక్షణమైన జీవించ లేమమ్మా చరణం: ఓ భూమాతా నీ వైన మా స్వామి జాడ పరికించి తెలుపమ్మా ఓ పున్నాగ, కదంబ, మారేడు, మామిడి మీరైనా చెప్పండి ఓ మల్లీ జాజీ సంపెంగ పూలారా వనమంతా వెదకండి ఓ వన మయూరమా శిఖిపింఛ మౌళిని వెదకి తేవమ్మా చరణం: (కృష్ణుడు...) పాటకు ముందు మురళీ స్వరం రావాలి… ప్రతి తరవు నందు నిలిచింది నేనేగా నేనేగా… ప్రతి పులుగు నందు చేతనము నేనేగా.. నేనేగా.. ప్రతి పూవు నందు పరిమళము నేనేగా… నేనేగా… భువిలోన దివిలోన ప్రతి అణువులోన నేనేగా… నేనేగా… ఓ చెలులారా మీ హృదయాలలో నేనెపుడూ బందీగా వుంటాను కన్నెల మనసున నిలచి పోయిన కన్నయ్య వీడమ్మా పున్నమి జాబిలకీ కన్నెల సొగసుల చందము ఏదమ్మా - రామకృష్ణ దువ్వు Audio Producers & Rights owned by: RKSS Creations.

Comments

Popular posts from this blog

గోదా దేవి కధ | Goda Devi Katha | Omkaram | RKSS Creations.

సప్తపది చిత్ర సమీక్ష | Saptapadi Movie Review | Sitara | RKSS Creations.

జాతి రత్నాలు చిత్ర సమీక్ష | Jati Ratnalu Movie Review | Sitara | RKSS Creations.