Sankrathi Festival and its Significance
Sankranthi: Watch this video to know more about Sankranthi. తెలుగు ప్రజలు అత్యంత ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి . ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది . తొలి రోజు ' భోగి ' తో ప్రారంభమవుతుంది . పుష్యమాసంలో , హేమంత రుతువులో , శీతగాలులు వీస్తూ .. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి . ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది . మకర సంక్రాంతి రోజున , సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు . ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు తెలుపుతున్నాయి . సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు . ' భోగి ' రోజున కొన్ని రకాల కూరగాయలు , పాలు పోసి పులగాలు ( పొంగలి ) వండుతారు . ఈ భోగి రోజే గొచ్చి గౌరీవ్రతాన్ని ప్రారంభిస్తారు . భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు . ఆ అలంకరణలో పండ్లు , కూరగాయలు , చెరకు గడల లాంటివి వాడుతారు . మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు . పూజ పూర్తి ...