Posts

Showing posts from November, 2021

సప్తపది చిత్ర సమీక్ష | Saptapadi Movie Review | Sitara | RKSS Creations.

Image
సప్తపది చిత్ర సమీక్ష | Saptapadi Movie Review | Sitara | RKSS Creations. ‘ సప్తపది ’ కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత , దర్శకుడు ‘ కళాతపస్వి ’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ సప్తపది ’(1980). ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి . అంతేకాక , కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది .  1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు , 1980 లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ , వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mecha nism లాగా ఏర్పడిన తరుణం అది . ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ , ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు . ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పెళ్ళికి ముందే ఒక హరి...