నటరాజు ఆడేను తాండవం | Nataraju Adenu Tandavam | Song | Omkaram | RKSS Creations.

నటరాజు ఆడేను తాండవం | Nataraju Adenu Tandavam | Song | Omkaram | RKSS Creations.



నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం ... A devotional song on Lord Shiva Tandavam in Omkaram, RKSS Creations. Lyrics : Ramakrishna Duvvu, Composer : S Venu Madhav, Singers : T Krishna Rao, Moola Srilatha, Recording : Sri Matha Digital Recording Studio, Visakhapatnam, All rights on this song Audio reserved to RKSS Creations. #rkss_creations, #nataraju_adenu_tandavam, #omkaram, #srimatha_digital, #moola_srilatha, #singer_tkrishnarao, About Singer Srilatha : B high grade in classical, devotional and light music from all india radio Senior scholarship holder from govt of india. She is from Visakhapatnam. About Singer T Krishna Rao: A Prominent Singer from Visakhapatnam. He's contributed his voice for many private Albums. Lyrics: శివతాండవం సాకి: M : కైలాస శిఖరమే శివపాద స్పర్శతో కంపించి పోగా F: శిరసిడిచి గంగమ్మ తనువంటి స్వేదమై రాగా M: ఆకాశమే అదిరి ప్రద్యుమ్న హారతే ఈయగా F: మహదేవు కదలికతో వాయువిజృంభించి పోగా పల్లవి: M: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం F: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం M: జటా ఝూటములు వింజామరలై ప్రమధ గణములే భజంత్రీలై F: నాగాభరణమే నాదస్వరముగా చంద్ర బింబమే వెలిగే దివ్వెగా M: ఢమరుక ధ్వనిలో పదములు కదలగ ।।నటరాజు।। చరణం 1: M: సకల దేవగణకోటికాహ్వానం పలికి శేషనాగశయన బ్రహ్మాదులం గూడి F: దక్షుడు తలపెట్టె మహా యజ్ఞము శివుని పిలువక చేసె మహాపరాధము M: ప్రీతితో దరికేగ సతిని ధూషించ అవమానమగ్నిలో తానె భష్మమై పోగా M+F : భద్రుడై వీర భద్రుడై దిక్కులే పరుగు లెత్తగ F: ధరణీ తలమున గిరి ఝరి తలములు గగన తలమున సురవర జనములు M: ముల్లోకములే వెర వెర బోవగా ముష్కర మూకల మదములు అణచగ M: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం F: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం చరణం 2: F: వియోగ వ్యధ లోన పరమేష్ఠి నిలచి కైలాస శిఖరాన తపములో మునిగి M: లయ కారుడే మరచె విధి కార్యము లోకములు రక్షింప గిరి సుతను కలుపంగ F: శరముతో ఈశుని ప్రకోపించె మరుడు మదనాగ్ని లో తనువు మరగి పోగా M+F : రుద్రుడై ప్రళయ రుద్రుడై సంద్రమే ఎగసే నింగి పై M: ఫాల నేత్రమున భగ భగ మంటలు కుసుమ శరుని ఫెణ ఫెణ కాల్చగ F: భస్మమైన పతి కై రతి రోధించగ పార్వతి ప్రార్ధన హృదయము మీటగ M: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం F: నటరాజు ఆడేను తాండవం ఆ నటరాజు ఆడేను తాండవం - రామకృష్ణ దువ్వు

Comments

Popular posts from this blog

గోదా దేవి కధ | Goda Devi Katha | Omkaram | RKSS Creations.

సప్తపది చిత్ర సమీక్ష | Saptapadi Movie Review | Sitara | RKSS Creations.

జాతి రత్నాలు చిత్ర సమీక్ష | Jati Ratnalu Movie Review | Sitara | RKSS Creations.